పెందోట బాల సాహిత్య పీఠం పురస్కారాల విజేతలు

పెందోట బాల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బాల సాహిత్య పురస్కారాల ఫలితాలు వెల్లడించారు. విశిష్ఠ పురస్కారాల విభాగంలో డాక్టర్‌ వాసరవేణి పరుశరామ్‌ (సిరిసిల్ల జిల్లా), మంగళంపల్లి రామచంద్రమూర్తి (చేర్యాల); పురస్కారాల విభాగంలో శైలజ మిత్రా (హైదరాబాద్‌ జిల్లా), డాక్టర్‌ బి.సుధాకర్‌ (సిద్దిపేట జిల్లా), దారం గంగాధర్‌ (నిజామాబాద్‌ జిల్లా), పటరాయుడు కాశీ విశ్వనాథం (విజయ నగరం జిల్లా), బాలకవి పురస్కారాల విభాగంలో వేల్పుల శ్రీలత (ఠపెద్దపల్లి జిల్లా), చంద్రశేఖర్‌ (అనంతపురం జిల్లా) కు ఎంపికయ్యారు. ఈ నెల 9 శనివారం నాడు సిద్దిపేటలో నిర్వహించే కార్యక్రమంలో బాల సాహిత్య పురస్కారాలను అందివ్వనున్నారు.
– పెందోట వెంకటేశ్వర్లు