
ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నికైన సందర్బంగా 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతు వృత్తినే ధైవంగా భావిస్తు అంకిత భావంతో పని చేస్తూ విద్యార్థుల అభివృద్ధి కి కృషి చేస్తూ పని చేసిన ప్రతి చోట విద్యార్థుల హాజరు శాతం పెంచుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల గోవిందపేట్ (వి )మండలం లో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు గా సేవలు అందిస్తున్నారు మాడవేడి పద్మావతి. బోధన ,బోధనేతార కార్యక్రమాలు నిర్వహిస్తు విద్యార్థులలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వసం, నైతిక విలువలు పెంపొదిస్తూ విద్యార్థులను భావి భారత పౌరులు గా తీర్చి దిద్దుతూ పాఠశాల పేరు మీద యూ ట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించి పాఠాలు బోధిస్తూ పాఠశాల లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను పొందుపరచడం వల్ల అనేకులు వాటిని వీక్షిస్తూ అభినందనలు తెలియజేయడం గమనార్హం. ప్రైవేట్ పాఠశాలల కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల ను అభివృద్ధి చేయుటకు స్వచ్చంద సంస్థలు, ధాతల సహకారంతో పాటు సొంత ఖర్చులతో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయలు కల్పిస్తూ గ్రామ స్థాయిలో మంచి పేరు ప్రతిష్ట లను సంపాదించుకోవడం పలువురిచే ప్రశంసలు పొందడం జరిగింది. గౌరవనీయులైన గ్రామ సర్పంచ్ శ్రీమతి &శ్రీ బి . జమున గంగాధర్, ఎంపీటీసీ యాల్లా రాజకుమార్, సోసైటీ చైర్మన్ బంటు మహిపాల్,విడిసి అధ్యక్షులు లింగన్న సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు,పాఠశాల చైర్మన్ సయ్యద్ అంజాద్, విద్యార్థుల తల్లి దండ్రులు , ఉపాధ్యాయ బృందం గార్ల సహాయ సహకారంతో మండలం లోనే మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది.
దశాబ్ది ఉత్సవాలు 2023 మహిళా సమాఖ్య లో భాగంగా .ఆశన్నగారి జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది మండల విద్యాశాఖాధికారి గౌరవనీయులు శ్రీ. రాజా గంగారాం సార్ గారు ప్రతి విషయం లో ప్రోత్సహిస్తూ,అభినందించడం జరిగింది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సీతయ్య సార్ కూడా తమ సలహాలు సూచనలు ఇస్తూ ప్రోత్సాహం అందిచడం జరిగింది.శ్రీమతి మాడవేడి పద్మావతి ఉద్యోగరీత్యా అహర్నిశలు శ్రమిస్తూ ఈ జిల్లా స్థాయి అవార్డు అందుకోవడం ప్రశంసనీయం. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.