
ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు పట్టణ కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి డాక్టర్ బసంత్ రెడ్డి హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులను సన్మానించారు అలాగే క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డాక్టర్ బసంత్ రెడ్డి ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ ఏవో నర్సారెడ్డి లు అభినందించారు