మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ఆళ్ళపల్లి వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, స్థానిక వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు 2022 సంవత్సరంలో ప్రకటించిన 3000 వేతనం ఇవ్వాలి, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. వంట కార్మికులకు బిల్లులు ప్రతినెలా 5వ తేదీన చెల్లించాలని చెప్పారు. వంట కార్మికులకు ఒక రోజు రూ. 600/- చొప్పున ఇచ్చి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. 9, 10 తరగతి విద్యార్థుల మెస్ బిల్లులను చెల్లించాలని కోరారు. ప్రభుత్వం కోడి గుడ్లు, గ్యాస్, వంట సరుకులకు ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా డబ్బులు ఇవ్వాలన్నారు. వంట కార్మికుల అక్రమ తొలగింపులను మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్ లో తహసీల్దార్ భద్రయ్యకు పలు సమస్యల పరిష్కారానికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘం మండల మధ్యాహ్న భోజన కార్మికులు కె.సరస్వతి, సీ.హెచ్.నాగమణి, చింత నర్సమ్మ, నాగమణి, సుశీల, ఎర్రమ్మ, విజయ, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.