నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ ముదిరాజ్ సంఘం సభ్యులు మంగళవారం బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకిల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. పెద్దమ్మ గుడి ప్రహరీ గోడ, సంఘ భవనానికి నిధులు కేటాయించాలని వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు తగిలేపల్లి అంజయ్య, మమ్మాయి నాగరాజు తదితరులు పాల్గొన్నారు..