
గాంధారి మండల కేంద్రంలో నీ హరలే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న అనునిత్యం అష్ట కష్టాలు పడుతూ ఉపాధ్యాయులు పేద మధ్యతరగతివిద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారని సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర ఎంతో ఉన్నతమైనదని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులను గౌరవించాలని ఉపాధ్యాయులు చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాల అవరోదించాలని ఆయన అన్నారు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీ సభ్యులు శంకర్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సాయికుమార్, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్,ఎ ఏం సి మాజీ చైర్మన్ సత్యం ,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీ రావు,బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షుడు జింగురు సురేష్ తదితరులు పాల్గొన్నారు