సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి

– డిప్యూటీ చైర్మెన్‌గా నందిని
హైదరాబాద్‌ : సీఐఐ సదరన్‌ రీజియన్‌ నూతన ఆఫీస్‌ బేరర్స్‌ను ఎన్నుకున్నారు. 2023-24 ఏడాదికి గాను వొల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ అయినా కమల్‌ బలిని చైర్మెన్‌గా నియమితులయ్యారు. ఇంతక్రితం ఆయన డిప్యూటీ చైర్మెన్‌గా ఉన్నారు. చంద్రా టెక్స్‌టైల్స్‌ ఎండీగా ఆర్‌ నందిని నూతన డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిని సీఐఐలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. గ్రామీణాభివృద్థి , వరుస కూలీలపై సీఐఐ నేషనల్‌ కౌన్సిల్‌ టాస్క్‌ ఫోర్స్‌కు ఆమె చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2010-11కు గాను ఆమె సీఐఐ తమిళనాడు చైర్‌పర్సన్‌గా పని చేశారు.
వచ్చే దశాబ్దం భారత్‌దే : సంజీవ్‌ బజాజ్‌
వచ్చే దశాబ్ద కాలం భారత్‌దేనని సీఐఐ ప్రెసిడెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సీఎండీ సంజీవ్‌ బజాజ్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదరన్‌ రీజియన్‌ నిర్వహించిన ”ఇండియన్‌ ఇండిస్టీ 100” ప్యానెల్‌ చర్చలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే 25 ఏండ్లలో భౌతిక , డిజిటల్‌ మౌలికవసతులు, వాతావరణ మార్పులు అనేక వ్యాపారాలను ప్రభావితం చేయనున్నాయన్నారు. కొత్త ఆలోచనలు అందిపుచ్చుకోకపోతే అనేక వ్యాపారాలు మూతపడనున్నాయన్నారు. అమెరికన్‌ బ్యాంక్‌ల సంక్షోభం భారత బ్యాంక్‌లపై పెద్దగా ప్రభావం చూపక పోవచ్చన్నారు.