గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు

నవతెలంగాణ- భీంగల్
మండలంలోని సంతోష్ నగర్ తండాలో  పోషక అభియాన్ లో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలను చేపట్టారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషకాహారంపై సూపర్వైజర్ అవగాహన కల్పించారు. అలాగే అంగన్వాడి సెంటర్ల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంజి నాయక్ పంచాయతీ కార్యదర్శి అనుష తండా మహిళలు పాల్గొన్నారు.