
పట్టణం లో గల జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి ఇట్టి కార్యక్రమంలో పిల్లలు శ్రీకృష్ణ రాధా మరియు గోపికల వేషాధారణలో అందరిని కనువిందుపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణులందరూ వుట్టి కొట్టే కార్యక్రమం లో గోపికలతో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతి మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను పిల్లలందరికీ తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లతా , ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.