సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి 

– నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్
నవతెలంగాణ- కంటేశ్వర్
సమాజంలో తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ అన్నారు.. కేవలం ప్రభుత్వ పాలన యంత్రాంగం బాధ్యతనే కాకుండా తోటి వారిగా తమ బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిజామాబాద్ మున్సిపల్ శాఖ పరిధిలో నిరాశ్రయుల కోసం ఏర్పాటుచేసిన పట్టణ నిరాశ్రయుల భవనం స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.. పట్టణ నిరాశ్రయుల భవనంలో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ మండల్ మరియు వాసవి క్లబ్ వనిత ఇందుర్ వారి సంయుక్తంగా నిరాశ్రయులకు వర్షాకాలం మరియు రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, హాజరయ్యారు.. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ ను స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య మరియు సిబ్బంది అలాగే వాసవి క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ఎదుటివారికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.. కేవలం ప్రభుత్వ యంత్రాంగమే చేయాలని కాకుండా తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.. స్వచ్ఛంద సంస్థలు ఎన్నో తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు.. వాటిల్లో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం స్నేహ సొసైటీ సైతం తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందిస్తూ నిలవడం ఎంతో గొప్ప విషయం అన్నారు.. అలాగే వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ మండల్ అధ్యక్షులు భూమయ్య గుప్త మరియు వాసవి క్లబ్ వనిత ఇందుర్ వారు సైతం సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయం అన్నారు… వర్షాకాలం మరియు రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిరాశ్రయుల కోసం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం తమ చేతుల మీదుగా చేయించడం సంతోషకరం అన్నారు. ఇదిలా ఉండగా స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న వివిధ ప్రాజెక్టుల గురించి స్నేహ సొసైటీ కార్యదర్శి S. సిద్దయ్య పలు విషయాలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.. సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ తమ వంతు సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని చెప్పారు.. అలాగే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యానికి దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని నగర ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కల్పన, మల్లేష్ గుప్తా, డీఎంసీ శోభారాణి, కమ్యూనిటీ ఆర్గనైజర్ లావణ్య, స్నేహ సొసైటీ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఎన్ విమల తదితరులు పాల్గొన్నారు.