నయా స్పై థ్రిల్లర్‌

Naya A spy thriller99 సినిమాస్‌ బ్యానర్‌పై బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్‌ శర్మ హీరో, హీరోయిన్లుగా బిష్ణు దర్శకత్వంలో దీపక్‌ అధికారి నిర్మిస్త్ను స్పై థ్రిల్లర్‌ ‘హిట్‌ మ్యాన్‌’. ఈ సినిమా నవంబర్‌లో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియ జేశారు.
ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్‌ బిష్ణు అధికారి మాట్లాడుతూ, ‘ ఇదొక స్పై థ్రిల్లర్‌. దీనికి స్క్రిప్ట్‌ నేనే రాసి, డైరెక్ట్‌ చేయటంతో పాటు హీరోగానూ నటించాను. మన దేశంతోపాటు పారిస్‌, దుబారు, ఆమ్స్టర్డ్యామ్‌, నేపాల్‌, శ్రీలంక.. ఇలా 6 వేర్వేరు దేశాల్లో చిత్రీకరించాం. ఈ సినిమాను మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం.
ఛాప్టర్‌ 1 నవంబర్‌లో రిలీజ్‌ కానుంది. ‘రాంబో’ సినిమా తర్వాత విల్లు, బాణాలతో కూడిన యాక్షన్‌ మూవీ మరోటి రాలేదు. ఈ సినిమాలో అలాంటి యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించాం. ఛాప్టర్‌1కి సంబంధించిన షూటింగ్‌ పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ‘ఐరన్‌ మ్యాన్‌’ సినిమాలో జార్వీస్‌ టెక్నాలజీ ఉన్నట్లు ఈ సినిమాలో ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయటానికి ప్లాన్‌ చేస్తున్నాం. హిందీలోనూ రిలీజ్‌ చేయటానికి చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ట్రైలర్‌ విడుదల చేసి, రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తాం’ అని అన్నారు.
‘బిష్ణు మాకు మంచి స్నేహితుడు. రెండేళ్ల ముందు మా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు అవుట్‌ పుట్‌ చూశాక చాలా హ్యాపీగా ఉంది’ అని కో ప్రొడ్యూసర్‌ సిప్రా మిశ్రా చెప్పారు.