కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’, ‘ఎందుకురా బాబు’ పాటలు ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 8న ఉదయం 11:22 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు, ఇమేజ్‌కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటంతో పాటు, పూర్తి స్థాయి వినోద భరితంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.
భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం, అద్భుతమైన సంగీతం కలగలిసిన ఈ విందుభోజనం లాంటి చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకుని ఘన విజయం సాధిస్తుందని చిత్రబందం నమ్మకం వ్యక్తం చేసింది. ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.