విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

నవతెలంగాణ-జహీరాబాద్‌
అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ హెచ్చరించారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, టీఎస్‌ఐ డీసీ చైర్మెన్‌ మహమ్మద్‌ తన్వీర్‌, డీసీఎంఎస్‌ చైర్మెన్‌ శివకుమార్‌తో కలిసి వివిధ శాఖల అధి కారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వV ిాంచారు. ప్రధానంగా మిషన్‌ భగీరథ నీటి సరఫ రాలో న్యాల్కల్‌ మండలంలో తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయని.. ప్రతీ గ్రామంలో ప్రతి ఇంట కి నల్లా ఇవ్వాలని సంబంధిత అధికా రులను కలెక ్టర్‌ ఆదేశించారు. ఆ గ్రామంలో ఎన్ని నల్లాలు ఉన్నాయో గ్రామపంచాయతీలో రాసి పెట్టాలన్నా రు. జహీరాబాద్‌ పట్టణంలోని ఐడిఎస్‌ఎంటి కాలనీలో ఉన్న ప్లాట్ల సమస్యను తక్షణమే పరిష్క రించాలని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లారెడ్డిని ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఇప్పట ికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లకు అనుభవ దారులను కేటాయించాలన్నారు. అందులో ఇండ్ల నిర్మా ణానికి అనుమతులు ఇచ్చి.. విద్యుత్‌, నీటి సరఫ రా కూడా అందించాలన్నారు. వెంకటాపూర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు స్వాధీన పరుచుకుంటున్న భూముల్లో ఎవరైతే రైతులు కబ్జాలో ఉన్నారో వారికే నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశిం చారు. ముస్లిం మైనారిటీల కోసం బూడిదిపాడు గ్రామంలో ఐదెకరాల భూమి స్మశాన వాటికకు కేటాయించి.. ఆ వర్గం వారికి పొజిషన్‌ ఇవ్వాలని ఆదేశిం చారు. సెప్టెంబర్‌ 15 వరకు ఈ పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షపు నీరు జహీరాబాద్‌ మున్సిపాల్టీ నుంచి బయటికి వెళ్లేందుకు ఉన్న నాలాలపై అక్రమాలను తొలగి ంచి వెంచర్‌ యజమానులపై కేసులు నమోదు చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అభివద్ధి కార్యక్ర మాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర ్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వర్షాల కారణ ంగా పంటలు నష్టపోయిన జాబితా తయారు చేయా లన్నారు. గహ, ఆస్తి నష్టాలు ఎక్కడైనా జరిగితే వాటికి సంబంధించిన వివరాలను తక్షణమే అందజేయాలన్నారు. విద్యుత్‌ అధి కారుల నిర్లక్ష్యం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ ప్రమాదాలు తరచుగా జరుగుతు న్నాయని.. ఈ విషయమై విద్యుత్‌ అధి కారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. జహీరాబాద్‌ ట్రైడెంట్‌ చక్కర పరిశ్రమలో విధులు నిర్వహి స్తున్న కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్య లు చేపట్టాలని షుగర్‌ క్రేన్‌ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డిఓ వెంక రె డ్డి, విద్యుత్‌, మిషన్‌ భగీరథ, మున్సిపల్‌, పంచాj ుతీరాజ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.