జిల్లా కేంద్రమైన గ్రేడ్ వన్ మున్సిపాల్టీ సంగారెడ్డిలో ఉన్న ఏకైక రాజీవ్ పార్క్.. సరైన పట్టింపులేకపోవడంతో అధ్వానంగా తయారైంది. పిచ్చి మొక్కలు, ముళ్లపొదలకు ఆవాసంగా మారింది. ప్రహారీ ఎు్త తక్కువగా ఉండడంతో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. టిక్కెట్ కౌంటర్ కోసం ఏర్పాటు చేసిన గది మొదలుకొని.. మరుగుదొడ్ల వరకు అన్ని గదుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. పార్క్‌లోని లైట్ల వెలగకపోవడంతో రాత్రి సమయాల్లో పోకిరీలకు నిలయంగా మారుతున్నది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి.. పార్క్‌ను సుందరీకరణ చేస్తే.. అటు చిన్నపిల్లలతో పాటు, పెద్ద వారికి కూడా ఆహ్లాదరకరమైన వాతావరణం దొరుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఏండ్లుగా సుందరీకరణకు నోచుకోని వైనం చెత్త సేకరించే ట్రై సైకిళ్ల స్క్రాప్‌యార్డుగా పార్కు ముళ్ల పొదలతో నిండిన మరుగుదొడ్లు.. పని చేయని స్తంభాల లైట్లు పట్టించుకోని మున్సిపల్ పాలకమండలి
నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఆహ్లాదరకర వాతావరణాన్ని అందివ్వడానికి 12 ఏండ్ల క్రితం రాజీవ్ పార్కును నెలకొల్పారు. ఆరోగ్య ప్రియుల కోసం వాకింగ్ ట్రాక్‌లు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు ఏర్పాటు చేశారు. ఆహ్లాద కరంగా పార్కును ఏర్పాటు చేసినప్పటికీ.. సరైన పట్టింపు లేకపోవడంతో రానురాను పార్కు పరిస్థితి అధ్వానంగా తయారవుతూ వచ్చింది. పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటుచేసిన ఆట పరికరాలు అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడికక్కడా విరిగిపోయాయి. ఆహ్లాదకరంగా ఉండాల్సిన పార్కు.. గడ్డితో, పొదలతో నిండిపోయింది. సందర్శకులకు కనువిందు చేసేందుకు ఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన జల్ విహార్.. సరైన మెయింటెనెన్స్ లేక నిరుపయోగంగా మారింది. అంతేకా కుండా మున్సిపల్ చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసుకున్న ట్రై సైకిల్ పాతబడడంతో వాటిని పార్కులో పడేయడంతో.. స్క్రాప్ యార్డుగా తయార యింది. పార్క్ ప్రవేశానికి కొరకు టికెట్ల కోసం ఏర్పాటు చేసిన గది నిరుప యోగంగా మారింది. వాకింగ్ ట్రాక్ చుట్టూ గడ్డి, చెట్ల కొమ్మలు తో నిండి వాకింగ్‌కు పనికి రాకుండా పోయింది. మరుగుదొడ్ల కోసం ఏర్పాటు చేసిన గది.. చెట్లతో, పొదలతో నిండి ఉప యో గం లేకుండా పోయింది. పార్కుల్లో ఉన్న స్తంభాలకు లైట్లు లేక అంధకారం నెలకొంటున్నది. పదిమంది కార్మిక ులతో చేయాల్సిన పని ఇద్దరు ముగ్గురితో చేస్తున్నారు. ప్రహా రీ ఎత్తు లేకపోవడంతో పార్కులోకి అక్రమంగా చొరబడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పార్కుకు నైట్ వాచ్మెన్ దిక్కేలేడు. దీంతో పోకిరీలకు నిలj ుంగా మారు తున్నది. లక్షల టాక్స్‌లు కడుతున్నా.. మున్సి పాల్టీలోని ఏకైక పార్కును ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు పాలకమండలిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మున్సిపాల్టీ ప్రజలకు ఆహ్లాదకరవ వాతావరణాన్ని అందించే రాజీవ్ పార్కును సుందరీకరణ చేయాలని కోరుతున్నారు.
ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ సుజాతను వివరణ కోరగా.. తాను ఇటీవలే ఇక్కడ బాధ్యతలు స్వీకరిం చానని.. పార్కును ఇంకా పరిశీలించలేదని తెలిపారు.
పార్క్ అభివద్ధికి నిధులు కేటాయించాలి
సంగారెడ్డి పట్టణంలో ఉన్న రాజీవ్ పార్క్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పార్క్‌లో పిచ్చి మొక్కలు పెరిగి అడివిని తలపిస్తున్నది. పిల్లలు ఆడుకునే పరికరాలు తుప్పు పట్టి పాడై పోయాయి. ఓపెన్ జిమ్ పరికరాలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తంగా రాజీవ్ పార్క్‌లో నిర్వహణ లోపించింది. వాకింగ్ ట్రాక్ సరిగ్గా లేకపోవడంతో ఉదయం పూట పార్కుకు వచ్చే ఆరోగ్య ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పట్టించుకొని రాజీవ్ పార్క్ అభివద్ధికి నిధులు కేటాయించాలి.
– బంగారు కష్ణ, జన జాగతి అధ్యక్షులు
పార్క్‌ను ఆధునికరించాలి
రాజీవ్ పార్క్‌ను ఆధునికరించాలి. పార్క్ నిర్వహణ ప్రయివేటు వ్యక్తులకు కాకుండా.. పురపాలిక ఆధీనంలో ఉం డాలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రవేశం ఉండే విధంగా చూడాలి. సిద్దిపేట్, గజ్వేల్‌లో ఏ విధంగా అయితే పట్ట ణాన్ని అభివద్ధి చెందే విధంగా కషి చేస్తున్నారో.. అదే విధంగా సంగారెడ్డి పట్టణాన్ని అభివద్ధి చేసే విధంగా చూ డాలి. పాలకులు సంగారెడ్డిపై సవతి తల్లి ప్రేమ చూప ిస్తు న్నారు. సంగారెడ్డిలో ఉన్న ఒక్క పార్కు కూడా అధ్వాన స్థితి లోఉండడం సిగ్గుచేటు.వెంటనే పార్కును ఆధునీకరించాలి.
– ఖాజా అర్షదొద్దిన్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు
ఆహ్లాదకర వాతావరణం ఏర్పరచాలి
రాజీవ్ పార్కు నిర్వహణ లోపాలు సరిదిద్దడంలో అధికారులు ప్రజా ప్రతిని ధులు విఫలం చెందారు. కొన్నేండ్లుగా సరైన నిర్వహణ లేకపోవడంతో.. పార్కులో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగాయి. పార్కు నిర్వహణ, మరమ్మతుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు.. సరైన నిర్వ హణ బాధ్యతలు తీసుకోలేకపోతున్నారు. నాసిరకం పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవు తున్నారు. ఇప్పటికైనా వెంటనే పార్కుకు మరమ్మతులు చేసి..పార్కులో ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పాలి.
– శ్రీధర్ మహేంద్ర,
ఫోరమ్ ఫోర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు
పాలకుల నిర్లక్ష్యంతో అభివద్ధిని నోచుకోలేదు
సంగారెడ్డి పేరుకే గ్రేడ్‌వన్ మున్సి పాల్టీ. పాలకుల నిర్లక్ష్యంతోనే రాజీవ్ పార్క్ అభివద్ధికి నోచుకోవడం లేదు. నెలలో రెండు మూడుసార్లు మంత్రి సంగారెడ్డి పర్యటన చేస్తుంటారు.. అయిన ప్పటికీ రాజీవ్ పార్కుపై కనీసం దృష్టిసారించకపోవడం సరికాదు. ఉన్నతాధికారులు ఉంటున్న జిల్లా కేంద్రంలోని పార్కు పరిస్థితే ఈ విధంగా ఉండడం సిగ్గుచేటు. పార్కును స్క్రాప్ యార్డుగా మార్చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు స్పందించి పార్కులో సౌకర్యాలు కల్పించి ఆహ్లాదకర వాతావరణ నెలకొల్పాలి.
– ఎం.యాదగిరి,
సీపీఐ(ఎం) సంగారెడ్డి ఏరియా కార్యదర్శి