రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్సే

– చేవెళ్లలో భారీ మెజార్టీతో గెలుపు ఖాయం
– టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పామెన భీంభారత్‌
– కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు
నవతెలంగాణ-షాబాద్‌
రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని, చేవెళ్లలో కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో గెెలుపు ఖాయమని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు పామెన భీమ్‌ భారత్‌ అన్నారు. షాబాద్‌ మండలం బోడంపహాడ్‌ గ్రామానికి చెందిన కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భీమ్‌ భారత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కి గౌడ్‌ సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని తెలిపారు. స్వచ్ఛందంగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరు తున్నట్టు తెలిపారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌ తిరుగులేని పార్టీగా చేవెళ్లలో ఏర్పడుతుందన్నారు. అందుకోసం తను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ బోడంపాడు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు కొత్త పల్లి నవీన్‌, బూత్‌ కమిటీ అధ్యక్షుడు కళ్ళెం ఆనంద్‌, కార్యకర్తలు ఎండి రఫీక్‌, రాస వెంకటేష్‌, స్వామి, ఎండి ఇమ్రాన్‌, కళ్ళెం శ్రీధర్‌, మల్లేష్‌, శ్రీకాంత్‌ రెడ్డి, రంజిత్‌, కె నరేష్‌, సాయి, సందీప్‌, ఎండి ఇర్ఫాన్‌, జానీ, కృష్ణ, ఎండి ఉమర్‌, రఘునాథ్‌ రెడ్డి, కృష్ణ, సందీప్‌ కుమార్‌, తదితరులు ఉన్నారు.