అధిష్టానం టికెట్‌ నాకే ఇవ్వడం ఖాయం

– ఎస్సీ రిజర్వేషన్‌ నియోజకవర్గ అభ్యర్థిగా చేవెళ్ల టికెట్‌ ఇవ్వాలి
– రాచమల్ల చెన్నమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా
– అనేక సేవా కార్యక్రమాలు
– పీసీసీ అధ్యక్షుడు రాచమల్ల సిద్ధేశ్వర్‌
నవతెలంగాణ-మొయినాబాద్‌
ఎస్సీ రిజర్వేషన్‌ చెవేళ్ళ నియోజకవర్గంలో స్థానికుడినైనా తనకే కాంగ్రెస్‌ అధిష్టానం టిక్కెట్‌ ఇస్తుందని పీసీసీ అధ్యక్షుడు రాచమల్ల సిద్ధేశ్వర్‌ ఆశా భావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లా డుతూ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టు బానిసని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్తిగా టికెట్‌ అధిష్టానం తనకే ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ, పార్టీ బలోపేతానికి నిరం తరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. గతంలో నిర్వహించిన దళిత బస్సు చైతన్య యాత్రకు ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నట్టు గుర్తు చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నట్టు తెలిపారు. చట్టాలపై అవగాహన లేని వ్యక్తులు తాను స్థానికుడి కాదనీ, దుష్ప్రచారం చేయడం సరైంది కాదనీ, ఈ విషయంపై వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. పీసీసీ విభాగ అధ్యక్షుడుగా తాను పని చేస్తున్నానని రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేసే అర్హత ఉంటుందన్నారు. మండలంలోని తెలంగాణ ఉద్యమంలో అమరుడైన యాదిరెడ్డి కుటుంబాన్ని మొట్ట మొదట పరామర్శించి,ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది తానేనని గుర్తుచేశారు. ప్రస్తుతం అధికార నాయకులకు కాంగ్రెస్‌ రెబల్‌ స్థానికుడైన యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించే ధ్యాసే వారికి లేదని ఎద్దేవా చేశారు. రాచమల్ల చెన్నమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా బీదలకు, ఆపదలో ఉన్నవారికి అనేక సేవలు అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ పోటీల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌ ముగ్గురు రెబల్స్‌లో తానే ముందంజలో ఉన్నానని అది ప్రజలందరికీ తెలుసు అన్నారు. నియోజకవర్గ సమస్యలపై తనకు చక్కటి పట్టు ఉందని టికెట్‌ ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కషి చేస్తానని తెలిపారు. కానీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటూ, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు.