ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) నిరసనలు

నవతెలంగాణ-నేలకొండపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఐ(ఎం) జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె.వి రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం మండలంలోని చెరువు మాదారం, నాచేపల్లి, అనాసాగరం, చెన్నారం, రాయగూడెం తదితరులు గ్రామాలలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న నేలకొండపల్లి మండల కేంద్రంలో చేపట్టనున్న ధర్నాలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో పార్టీ మండల నాయకులు రచ్చ నరసింహారావు, దుగ్గి వెంకటేశ్వర్లు, రాసాల కనకయ్య, మారుతి కొండలరావు, రాసాల నవీన్‌, ఎడ్ల తిరుపతిరావు, శివరాజు, గుత్తా లక్ష్మీనరసయ్య, పోట్ల భాస్కర్‌ రావు, ఎస్‌.కె నవాబ్‌, బీరెడ్డి యాకయ్య, సిద్దయ్య పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్‌ : పెంచిన నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) ఖమ్మంరూరల్‌ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌ అన్నారు. నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఎం.వెంకటయపాలెం గ్రామంలోని శ్రీనివాస్‌ నగర్‌ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపూరి వర కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధుకు ఎక్కువ యూనిట్లు కేటాయించాలని, గృహలక్ష్మి పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని పోరాటాలకు మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అభ్యుదయవాదులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యుడు నందిగామ కృష్ణ, వడ్లమూడి నాగేశ్వరరావు,కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు పాపిట్ల సత్యనారాయణ, నాయకులు వడ్లమూడి మల్లయ్య, శ్రీను, ఏపూరి నాగేశ్వరరావు, పుల్లయ్య, తిరపయ్య, సైదులు, హుస్సేన్‌, రమేష్‌, భారతమ్మ, రేణుక, రమాదేవి, ఉపేంద్ర పాల్గొన్నారు.
మధిర : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఖమ్మంపాడు సీపీఐ(ఎం) శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంచి స్థానిక మసీదు సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మద్దాల ప్రభాకర్‌ మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని, కార్డులు లేకపోవడం వల్ల గృహలక్ష్మి, బీసీ, మైనార్టీ, దళిత బంధు వంటి పథకాలకు అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకోలేక పోతున్నారన్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బాదినేని వెంకట నరసయ్య, వాడిత్య లాల్‌, శేక్‌ సైదులు, రహీమ్‌, లాల్‌, వెంకటేశ్వరరావు, కరీం, తిలక్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.