నవతెలంగాణ-ములుగు
జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని బ్రిలి యంట్ స్కూల్ ఆవరణలో బుధవారం విద్యార్థులతో ములుగు జిల్లా షీటీం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ బాలికలకు సోషల్ మీడియా ఆప్స్ అయినటటువంటి ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో ఎవరు కూడా వ్యక్తిగత ఫోటోలు సమాచారం ఉంచొద్దని తెలిపారు. ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా ఆప్స్ ద్వారానే మోసగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఫోటోలు మార్ఫింగ్ చేసి బాలికలను బ్లాక్ మెయిల్ చేస్తున్నందున ఎవరూ కూడా వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా వెబ్సైట్లో ఉంచొద్దన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ , చట్ట వ్యతిరేకంగా దత్తత తీసుకోవడం, బాల్యవివాహాలు, శ్రమ దోపిడీ, బిక్షాటన ఆపత్కాల సమయాల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 100కు ఫిర్యాదులపై వివరించారు. బాలల సమస్యలు ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ యాదగిరి హెడ్ కానిస్టేబుల్ రామయ్య, మధు,మహిళా కానిస్టేబుల్ చైతన్య పాల్గొన్నారు.