– ఉపన్యాసాలు కట్టిపెట్టండని బీఆర్‌యస్ కార్పొరేటర్లకు అడ్డుతగిలిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
– సమావేశం నుంచి బహిష్కరణ.. కార్పొరేషన్ ఎదుట బైఠాయింపు
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ లో అధికార బీఆర్‌ఎస్, ప్రతి పక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఢ అంటే ఢ అనేలా వాగ్వివాదానికి దిగారు. కౌన్సిల్ హాల్ లో మేయర్ నీరజ అధ్యక్షతన కార్పొరేషన్ పాలకవర్గ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిం చారు. సభలో మేయర్ సహా బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఖమ్మంనగర అభివద్ధిపై మాట్లాడారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజరు కుమార్ కషితో నగర అభివద్ధి జరిగిందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలని, అధికార పార్టీ ఊకదంపుడు ప్రసంగాలు సరికాదని కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, ఇతర కాంగ్రెస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని బారు కాట్ చేస్తూ బయటకు వచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల , మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, దొడ్డ నగేష్ , దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రఫిదా బేగం తదితరులు కార్పొరేషన్ కార్యాలయం లోపల ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్ అక్రమాలపై దష్టి సారించాలని, ప్రోటోకాల్ పాటించాలని, కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుమతించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశ వివరాలను మేయర్ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశారు. 22 అంశాలతో కూడిన ఎజెండాను సభ్యులు ఆమోదించడం జరిగిందన్నారు. కార్పొరేషన్ లోని 60 డివిజన్ల పరిధిలో ఆయా డివిజన్ల వారీగా చేపట్టిన అభివద్ది పనులు, చేపట్టబోయే పలు నిర్మాణాభివద్ధి పనులకు నిధులు,కావాల్సిన మౌళిక సదుపాయాలు, డివిజన్ లలో నెలకొన్న పలు సమస్యలు,వాటి పరిష్కారానికి కషి,వంటి పలు కీలక ప్రధాన అంశాలపై ప్రజాప్రతినిధుల సలహాలు,సూచనలతో చర్చను సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
అక్రమాలపై ప్లకార్డులు
రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లోకేష్ , బిల్ కలెక్టర్ జగదీష్ లు ఇద్దరు ప్రైవేట్ సిబ్బంది సతీష్ , నరేశ్ లను ఏర్పాటు చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. సదరు సిబ్బంది దర్జాగా కార్పొరేషన్ కార్యాలయంలో కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటోల ప్లే కార్డులను ప్రదర్శించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, బి.ఆర్.ఎస్. ఫ్లోర్ లీడర్ కర్నాటి క్రిష్ణ, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మేనేజర్ విజయానంద్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ రంజిత్, మున్సిపల్ ఈ ఈ కష్ణాలాల్, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, మలేరియ అధికారులు తదితరులు పాల్గొన్నారు.