నవతెలంగాణ-ములుగు
భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలు గొప్పవని, సాంస్కతిక కార్యక్రమాలతో చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. మన సంస్కతిని భవిష్యత్ తరాలకు అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో శ్రీకష్టామిని పురస్క రించుకొని బుధవారం ములుగులోని లీలాగార్డెన్స్‌లో బాలగోకులం నిర్వహించారు. ములుగులోని బిట్స్, సెయింట్ ఆంథోనీస్, సన్‌రైజర్స్, సాధన, శ్రీ అరవింద, లిటిల్ ఫ్లవర్, వెంకటాపూర్ లోని జోహార్ హై స్కూల్ చిన్నారులతో శ్రీకష్ణుడు, గోపికల వేషధారణలతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చదువుతోపాటు వివిధ అంశాల్లో చిన్నా రులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, స్కూల్ యాజమా న్యాలను, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. శ్రీ గురు యోగ, నేచురల్ హీలింగ్ థెరపిస్ట్ శివకృష్ణ మాట్లాడుతూ భారతీయ విలువలు, సంస్కతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం స్కూల్ యజమానులను శాలువాతో సన్మానించి మెమోంటో అందించారు. చిన్నారులకు నూనె భిక్షపతి, యశ్వంత్ పులిహౌరా ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కనుకల చంద్రారెడ్డి, లింగంపల్లి నవనీతరావు, విజన్-40 కాలేజ్ కరస్పాండెంట్, అంబీర శ్రీకాంత్ గౌతమ్ కాలేజ్ డైరెక్టర్, మనోహర్‌రావు లీలా గార్డెన్ యాజమాన్యం, బద్ధం సుదర్శన్‌రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్స్ ఎండ జాయీద్, కొలగాని రజినీకాంత్, కందాల రమేష్, పెట్టెం రాజు, కర్రా రాజేందర్ రెడ్డి, అక్కల సతీష్, దుగ్గి రెడ్డి సురేందర్ రెడ్డి, గిరిగాని కవిత, కష్ణ, ధర్మజాగరణ సమితి సభ్యులు నగరపు రమేష్, తదితరులు పాల్గొన్నారు.