గోడె నరసింహారావు సేవలు అభినందనీయం

– కలెక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ పాల్వంచ
గోడె నరసింహారావు సేవలు అభినందనీయమని కలెక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు. ఆగస్టు 31వ తేదీన పదవి విరమణ చేసిన కలెక్టరేట్‌ కార్యాలయపు సబార్డినేట్‌ నరసింహారావు పదవీ విరమణ అభినందన సభ మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నరసింహారావుకు శాలువా కప్పి అభినందించారు. 1987 అక్టోబర్‌లో రెవెన్యూశాఖలో రాత్రి కాపాలాదారుగా విధుల్లో చేరిన నరసింహరావు 36 సంవత్సరాలు పాటు రెవెన్యూ శాఖలో సుదీర్ఘమైన, అమూల్యమైన సేవలు అందించాలని కొనియాడారు. కలెక్టరేట్‌లో విధులు నిర్వహించి పలువురి కలెక్టర్లు మన్ననలు పొందారని వారి సేవలు చాలా విలువైననవని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, ఏవో గన్యా, నాలుగో తరగతి ఉద్యోగుల అధ్యక్షులు అజ్మీర రామ్‌ రవి, కన్యావతి, తాజుద్దీన్‌ మస్తాన్‌, వై నరసింహారావు, గౌతమ్‌ తదితరులు నరసింహారావుకు పుష్ప గుజ్జాలు శాలువాలు కప్పి అభినందించారు.