శ్రీ సరస్వతి విద్యా మందిర్ లో కృష్ణాష్టమి వేడుకలు 

నవతెలంగాణ- భీంగల్
పట్టణ కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో గురువారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న  చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో  ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం చిన్నారులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో పాఠశాల తరఫున మెమొంటోలతో  సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు నర్సయ్య, ప్రధానాచార్యులు  రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, యెన్ను శ్రీధర్, మంచే గణేష్, ఫ్లోర్ ఇన్చార్జిలు రవికుమార్, స్రవంతి, రమాదేవి, అకౌంటెంట్ హరికృష్ణ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.