సమాజంలో ప్రజలను చైతన్యం చేసేది విలేకర్లు

– అలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సోమ వనజ
నవతెలంగాణ – సిద్దిపేట
సమాజంలో ప్రజలను చైతన్యం చేసేది విలేకర్లు అని అలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సోమ వనజ అన్నారు. జర్నలిస్టు డే దినోత్సవ సందర్భంగా గురువారం మిత్ర అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ సమాజంలో జరిగే ఏ రకమైన సేవలు అయినా ప్రజల దృష్టికి తీసుకువచ్చేది పాత్రికేయలేనని, అలయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను కూడా వారు పత్రికల ద్వారా ప్రజలకు అందజేయడం సంతోషకరమని అన్నారు. ఇప్పటివరకు ఎనిమిది మంది నిరుపేదలకు వివాహాలు చేశామని, నిరుపేద విద్యార్థులకు ఆర్థికంగా సహకారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ ప్రతినిధులు అంతర్జాతీయ కమిటీ  చైర్మన్  అంజయ్య, మాజీ గవర్నర్ రాజేశ్వరరెడ్డి , వైస్ గవర్నర్లు బాలచంద్రం, శివకుమార్, రాంచంద్రం, సత్యనారాయణ, మల్లేశం, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.