దళిత యువకులపై దాడి చేసిన వారిని శిక్షించాలి

– కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు కొంకటి రాములు
– మందమర్రి ఘటనపై ప్రభుత్వాధికారులు నిర్లక్యంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు 
నవతెలంగాణ – బెజ్జంకి 
మేకను దొంగిలించారనే నేపంతో మందమర్రిలోని దళిత యువకులపై దాడి చేసిన వ్యక్తులపై ప్రభుత్వాధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు కొంకటి రాములు గురువారం డిమాండ్ చేశారు.కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక దళిత సామాజిక వర్గాలపై దాడులు జరుగుతున్నాయని..అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దళిత సామాజిక వర్గాలను అణచివేతకు గురిచేస్తున్నాయని కొంకటి రాములు మండిపడ్డారు. మందమర్రి ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని..దాడి చేసిన వ్యక్తులపై ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా త్వరితగతిన స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాములు కోరారు. మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్,నాయకులు మంకాల ప్రవీణ్, శానగొండ శ్రావణ్, బోనగిరి రాజేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మచ్చ కుమార్, సందీప్ పాశం బాల్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.