
– మండల కేంద్రంలో భారీ ర్యాలీ..
– మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి, అరికెల నర్సారెడ్డి, నాగేష్ రెడ్డి, తహెర్ బిన్ హందన్..
నవతెలంగాణ-డిచ్ పల్లి
– మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి, అరికెల నర్సారెడ్డి, నాగేష్ రెడ్డి, తహెర్ బిన్ హందన్..
నవతెలంగాణ-డిచ్ పల్లి
బిఅర్ఎస్ ప్రభుత్వం అవినీతి లో కురుకు పోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దేశంలో, రాష్ట్రం లో అవినీతి లేని పాలన అందజేస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతమని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న డిక్లరేషన్ను ప్రజల ముందు పెట్టి ఆమోదం పొందుతూనే అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్పై ఉందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి, అరికేల నర్సారెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హందన్, నిజామాబాద్ మార్కేట్ కమిటీ మాజీ చైర్మన్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి లు అన్నారు. గురువారం కాంగ్రెస్ అగ్రనేత,ఎంపి
రహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రలో హాత్ సే హాత్ జూడో కార్యక్రమం నిర్సంవహించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 7 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి,టి పిసిసి ఉపాధ్యక్షులు తహర్బిన్ హంధాన్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ బిఅర్ఎస్ ప్రభుత్వం అవినీతి లో కురుకు పోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దేశంలో, రాష్ట్రం లో అవినీతి లేని పాలన అందజేస్తామని,ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం వ్యాప్తంగా మహిళలలకు ఎక్కడి నుండి ఎక్కడి వరకైన రాకపోకలకు ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తామని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులకునిరంతరాయంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తామని,ఇదే కాకుండా రైతులకు అదుకోవడానికి రెండు లక్షల రూపాయలరూణమఫి, ఏడాదికి 12 వేల రూపాయలను అందజేసి తీరుతమని, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులకు ఇతరులకు ప్రతి నేలా 4 వేల రూపాయల పేన్షన్ క్రమం తప్పకుండా అందజేస్తామని దినిలో ఎవ్వరికీ ఏలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ,ఎస్టీ లకు 6 లక్షలు పూర్తి సబ్సిడీతో అందజేస్తామని తెలిపారు.బీఆర్ ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తడం లేదన్నారు.ఎదో ఒక గ్రామంలో ఏళ్ల క్రితం కట్టిన డబుల్ బెడ్ రూం లు పేదలకు అందజేయ లేదని విమర్శించారు.ఇది మాటల ప్రభుత్వమని,కాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ని, ఎన్నికల మెనిఫేస్టో లో ప్రజల ముందు పేట్టి ఖచ్చితంగా అమలు చేసి తిరుతమని వారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను ఇచ్చి చుపుతమని, బిఅర్ఎస్ ప్రభుత్వం నీరుద్యోగులకు ఉద్యోగలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తామని పేర్కొన్నారు. మహిళా విద్యార్థినులకు ఉచితంగా స్కుటిలను అందజేస్తామని, ఆరోగ్య శ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తామని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు, రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నేరవేర్చామని, బిఅర్ఎస్ ఇచ్చిన హామీ నేటి వరకు అమలుకు నోచుకోలేదని,నాడు కాంగ్రెస్ చేసిన అభివృద్ధే గ్రామాల్లో కనబడుతుందని వివరించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ను ప్రజల ముందు పేడ్తమని, కళాశాలలకు వేళ్ళే విద్యార్థినులకు ఉచితంగా స్కుటిలను అందజేస్తామని ఇదే కాకుండా ప్రజలకు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని దివించాలని సూచించారు.బిఅర్ఎస్ ప్రభుత్వం అవినీతి లో కురుకు పోయిందని, తెలంగాణ రాష్ట్ర అంకాక్ష ను సోనియాగాంధీ ముందుకు వచ్చి నేరవేర్చిందని కెసిఆర్ ఒక్కరితో రాష్ట్రం ఏర్పడలేదన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా కిసాన్ ఖెత్ అధ్యక్షులు ముప్పగంగా రెడ్డి, మండలాల అధ్యక్షులు మృతపూర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి,పోలసని శ్రీనివాస్, డిసిసి డెలిగేట్స్ వాసు, ధర్మ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి,ఎల్లయ్య,పిసిసి డెలిగెట్ శేఖర్ గౌడ్, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి, ధర్మ గౌడ్, హబిబ్, డాక్టర్ జహుర్, చెన్నా రెడ్డి, బకారం రవి, సాయి రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్యాంసన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మురళి, నరేష్, సాయి రెడ్డి, రాజు, గంగారెడ్డి, వసంతరావు, ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్, రవి వినోద్, అనిల్ రెడ్డి, ఆకాష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ శ్రీను నాయక్, రాజన్న, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.