తపాలా శాఖలో విస్తృతం చేస్తున్న మరిన్ని సేవలు..

నవతెలంగాణ- ఆర్మూర్: ప్రజలకు ఇప్పటికీ వివిధ సేవలను అందిస్తున్న భారత తపాలా శాఖ వినియోగదారులకు మరింత చేరువకానుంది అని తపాలా శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపారు సురేఖ గురువారం తెలిపారు. తాజాగా విదేశాలకు వస్తువులను ఎగుమతి చేసే సంస్థలకు శుభవార్త చెప్పింది. తక్కువ ఖర్చుతో సులభంగా డాక్ నిర్యాత్ కేంద్రాల ద్వారా నిజామాబాద్ కామారెడ్డి పట్టణంలో విదేశాలకు వస్తువులను పంపించేందుకు ప్రత్యేకంగా డాక్ నిర్యాత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఇంపోర్ట్ , ఎక్స్పోర్ట్ ,లైసెన్స్ ఐఈసి కోడ్ కలిగిన సంస్థలు డీఎన్ కే ద్వారా సులభంగా అతి తక్కువ ధరలో విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని తెలిపారు .అంతేకాకుండా ఫ్రీ హోమ్ పిక్ అప్ తో పాటు అతి తక్కువ ధరలో పార్సల్ ప్యాకింగ్ యూనిట్ ద్వారా ప్యాక్ చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. భారత తపాలా శాఖ జాయింట్ పార్సెల్ ప్రోడక్ట్ పేరుతో రైల్వే బోర్డు ద్వారా పార్సెల్స్ డెలివరీ చేయనుంది. పార్సల్స్ పిక్ అప్ చేసుకుని బుకింగ్ చేసి రైల్వే ద్వారా సురక్షితంగా మెటల్ బాక్సెస్ లో ట్రాన్స్పోర్ట్ చేసి డెలివరీ చేసే సౌకర్యం కూడా కలిగించనుందని మరిన్ని వివరాల కొరకు తమ దగ్గరలోని  పోస్ట్ ఆఫీసుని సంప్రదించాలని తెలిపారు.