ముందే హెచ్చరించిన కాంట్రాక్టర్లు వినలే: చంద్రకాంత్ రెడ్డి

నవతెలంగాణ -భిక్కనూర్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న సమయంలో 5 నుంచి 6 ఫీట్ల ఎత్తు లేపి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు హెచ్చరించిన వినకుండా నిధులు సరిపోవని నాసిరకంగా తక్కువ ఎత్తులోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. 2016 సంవత్సరంలో రామేశ్వర్ పల్లి గ్రామ సర్పంచ్ శ్యామల చంద్రకాంత్ రెడ్డి ఉన్న సమయంలో గ్రామ సర్పంచ్, టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను 6 ఫీట్ల ఎత్తు లేపి నిర్మించాలని లేనిచో పనులు నిలిపివేయాలని హెచ్చరించిన కాంట్రాక్టర్లు నిధులు సరిపోవని తక్కువ ఎత్తులోనే డబుల్ బెడ్ రూమ్ లో ఇండ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. ముందే హెచ్చరించిన సమయంలో 6 ఫీట్ల ఎత్తు లేపి నిర్మిస్తే డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి నీరు వచ్చెది కాదని, కోట్ల రూపాయల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేద కుటుంబాలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం నేలపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.