
– నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజాంబాద్ నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో తేది 05.09.2023 నాడు వినయకనగర్ నందు గల బస్వగార్డెన్స్ దగ్గర ఒక గుర్తుతెలియని మగ మనిషి వయస్సు సుమారు 80 సం,, గల వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా చుట్టుపక్కల ప్రజలు 108కి ఫోన్ చేయగా అట్టి గుర్తుతెలియని మగ మనిషిని చికిస్త గురించి గవర్నమెంట్ హస్పిటల్ కి చికిత్స నిమిత్తం రెండు రోజుల క్రితం తరలించినట్లు నాలుగో పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు. సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం చికిత్స చేయిస్తుండగా గురువారం అనగా తేది 07.09.2023నాడు ఉదయం 0200 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణిచటం జరిగింది. కావున ఇట్టి గుర్తుతెలియని వ్యక్తి శరీరం పైన తెలుపు రంగు షర్ట్ దరించి ఉన్నాడు. ఇట్టి వ్యక్తి ని గుర్తుపట్టిన వారు టౌన్ 4 పోలీస్ స్టేషన్ నిజామాబాదు నందు సంప్రదించగలరు. సంప్రదించగల ఫోన్ నంబర్స్: 8712659840, 8712659719 అని తెలియజేశారు.