సైబర్ ఆధారిత నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం

– అసెంబ్లీ ఎన్కికలు సమీపిస్తున్న నేపధ్యంలో ప్రణాలికలు సిద్ధం చేయాలి
– పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి సకాలంలో చార్జిషీట్ దాఖాలు చేయాలి
– ఈ నెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి.
– సమీక్ష సమావేశంలో పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్., గారు వెల్లడి
నవతెలంగాణ- కంటేశ్వర్
సైబర్ ఆధారిత నేరాలను  సమర్థవంతంగా కట్టడి చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా నేరాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్., అన్నారు.జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ యందు నిర్వహించిన సమావేశంలో పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్ భద్రత పై శిక్షణ పూర్తి చేసుకొని సిద్ధమైన పోలీస్ అధికారులు సైబర్ మోసగాళ్ల ఆటకటించేలా ఈ విభాగం పకడ్బందిగా పనిచేస్తుందని తెలిపారు. సైబర్ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం ఆయా రాష్ట్రాల సహకారంత పట్టుకోవడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికాం ఆపరేటర్ల నోడల్ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంబింప చేయడం, నకిలీ బ్యాంక్ ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్ నెంబ రును గుర్తించి నియంత్రించడం, పలుమార్లు నేరాలకు పాల్పడే అంతరాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి చేధించడం వంటి కీలకమైనపాత్రను సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగం పోషిస్తుందని తెలిపారు.ఈనెల 9న న్యాయస్థానాల్లో జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీపడదగిన క్రిమినల్, కేసులతో పాటు భూ తగాదా, చిట్ ఫండ్, రోడ్డు ప్రమాద, ఎక్సైజ్, వివాహ, కుటుంబ తగాదాల తో పాటు ట్రాఫిక్ కేసులకు సంబంధించి డ్రంకన్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ కేసులు, ట్రాఫిక్ ఈ చలాన్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేలా చేసే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాని విజయవంతం చేయాలని సూచించారు.
       అసెంబ్లీ ఎన్కికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే ప్రణాళికలు సిద్దం చేసుకుంటే నిర్వహణ సులభతరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా క్రిటికల్ పల్నేరబిలిటీ పోలీంగ్ కేంద్రాల గుర్తిం పులో స్పష్టత ఉండాలన్నారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకోపోస్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాజకీయ ఘర్షణలకు తావులేకుండా నిఘా వ్యవస్తను పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని అన్నారు.ఫోక్సో యాక్ట్, క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ గ్రేప్ కేసుల్లో విచారణ వేగవంతం చేసి చార్జీషీట్ సకాలంలో దభాలు చేసేలా పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా నేరాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రౌడీ షీటర్ల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ (లా అండ్ ఆర్డర్ ) ఎస్. జయ్ రామ్, నిజామాబాద్ , సి.సి.ఆర్.బి, టాస్క్ ఫోర్స్ ఎ.సి.పిలు కిరణ్ కుమార్,  రవీంధర్ రెడ్డి,  రాజశేఖర్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్  శ్రీశైలం, సి.ఐలు, ఎస్.ఐలు మొదలగువారు పాల్గొన్నారు.