మెప్పించే పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌

A delightful political entertainerఅభయ్ నవీన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్‌’. ఫైర్‌ ఫ్లై ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో సిద్ధార్థ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ఒక కథను కాకుండా అభరు తన లైఫ్‌లో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు. ట్రైలర్‌ చాలా బాగుంది. అలాగే ఫన్‌ వెనక ఒక ఎమోషన్‌ ఉంది’ అని తెలిపారు.’ఒక ఊరిలో రాజకీయ నాయకుడిగా ఎదగాలని రాజు అనే యువకుడు చేసిన ప్రయత్నాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయి అనేది సినిమాలో ఆకట్టుకునేలా చూపిస్తున్నాం. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అభరు నవీన్‌ అన్నారు.