రూ.12,999కే రియల్‌మీ నార్జో 60ఎక్స్‌

న్యూఢిల్లీ : రియల్‌మీ కొత్తగా మార్కెట్లోకి నార్జో 60 ఎక్స్‌ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్‌ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. 4జిబి ర్యామ్‌ ధర రూ.12,999గా, 6జిబి ర్యామ్‌ ధరను రూ.14,999గా నిర్ణయించింది. దీని అమ్మకాలు సెప్టెంబర్‌ 12న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. వెనుకవైపు 50 మెగా పిక్సెల్‌ ఎఐ కెమెరా సహా మరో కెమెరాను అమర్చింది. సెల్ఫీ కోసం 8ఎంపి కెమెరాతో రూపొందించింది.