లిల్లీపుట్ పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ-ఆర్మూర్ 
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం శుక్రవారం నిర్వహించినారు… ఈ సందర్భంలో పాఠశాల కరస్పాండెంట్ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుక గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అందరికీ విద్య లక్ష్యంగా యునెస్కో 1966 సంవత్సరం నుండి ఈ అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నారని ముఖ్యంగా 1820వ సంవత్సరంలో 12% మాత్రమే అక్షరాసులు ఉండేవారని 2016వ సంవత్సరం నాటికి 14% నిరక్షరాస్యతలు మాత్రమే ఉన్నారని పేర్కొనడం జరిగింది. ఓనమాలతో మొదలైన అక్షరాలు మనిషి జీవితాన్ని మార్చేసే గెలుపు మెట్ల అని ఆయన పేర్కొన్నారు సంపద కంటే చదువు గొప్పది ఎందుకంటే సంపదను మనం కాపాడాలి చదువు మాత్రం మనల్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధిలో ఒకరిగా ముందుకు సాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపాల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.