నవతెలంగాణ-ఆర్మూర్
రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ పట్వారి గోపికృష్ణ అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలోని విద్య హైస్కూల్లో నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు 20, ప్రైవేటు ఉపాధ్యాయులు 10 మందిని గౌరవప్రదంగా పూలమాల శాలువా సర్టిఫికెట్ జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా కీలకమని విద్యార్థి యొక్క నైపుణ్యాలను విలువలను , వెలికి తీసే పాత్ర దేశంలో ఉపాధ్యాయులే అని , విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ ,స్పాన్సర్ విద్యా ప్రవీణ్ పవార్ , కార్యదర్శి తులసి కోశాధికారి లక్ష్మీనారాయణ పి.డి.జి హనుమంత్ రెడ్డి, ఏ. జి. శ్రీనివాస్ పద్మ మురళి, కాంతి గంగారెడ్డి పుష్పకర్ రావ్ ,సురేష్, గోనె దామోదర్, ఆనంద్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.