
మండలంలోని కల్లేడ గ్రామంలోని కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు సుమారు 100 మంది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో శనివారం చేరారు. డేగ రాజేశ్వర్, డేగ భార్గవ్, మచ్చ సురేష్ గౌడ్, పద్మశాలి కుల సంఘం సభ్యులు బి అర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మనీష్, వైస్ చైర్మన్ రమేష్, బి అర్ ఎస్ నాయకులు సుక్కి సుధాకర్, గ్రామ అధ్యక్షులు చిన్నా రమేష్, అనిల్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.