
తెలంగాణ యూనివర్సిటీలోని న్యూ బాయ్స్ హాస్టల్ లో ఎన్ఎస్యుఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మకు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షుడు కే.శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చిట్యాల ఐలమ్మ, ఆమె మహిళలకు స్ఫూర్తి నిచ్చిన వీర వనిత అన్నారు.50 ఏళ్ల కిందట ఐలమ్మ చేసిన భూ పోరాటం నేటికీ గొప్పగా చెప్పుకుంటున్నామని, ఐలమ్మను ఒకవైపు తెలంగాణ తల్లిగా గుర్తిస్తూనే మరొకవైపు నుంచి కేవలం ఆమెను వెనకబడిన కులానికే పరిమితం చేసే కుట్రలు, ప్రయత్నం జరుగుతున్నాయని విమర్శించారు. ఐలమ్మ లాంటి ప్రశ్నించే గొంతుకలో నేటి సమాజానికి అవసరమని మహిళలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఆనాటి సమాజంలో తెలంగాణ పల్లెల్లో కొనసాగిన అరాచకాలు, అమానవీయ ఘటనలు చాలా దురదృష్టకరమన్నారు. ఆనాడు ఐలమ్మ తాను సాగుచేసిన భూమికోసం, భుక్తి కోసం పండించిన పంటను దక్కించుకునేందుకు పోరాటం చేసింది. అలాంటి పోరాటాలు నేటికీ పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తీసుకువచ్చినటువంటి ధరణి పోర్టల్ తో చిన్న,సన్నకారు రైతులు తమ హక్కుల్ని కోల్పోయి కంటతడి పెట్టాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. దాంతోపాటు రైతుబంధుతో ధనిక రైతులు లాధపడ్డారు కానీ పేద, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు బాధపడుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అనిల్ రాజేందర్, విజయ్, శివ, అనిల్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు.