
తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా చరిత్రలో నిలిచిందని సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ, సగర సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు దుంపల సమ్మయ్య, రజక సంఘం మండల అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంతో పాటుగా, ఉప్పెరగూడెం గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ పీడన నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ చూపిన తెగువ సామాజికంగా దిగువన ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తినిచ్చిందన్నారు. సాయుధ ఉద్యమ సమయంలో ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు ఎనలేనివని గుర్తు చేశారు. తెలంగాణ పౌరుషాన్ని త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. సబ్బండ వర్గాల సంక్షేమం, మహిళా అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, ఉపసర్పంచ్ శ్రీరామ్ రాము, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి, వార్డు సభ్యులు ఏదునూరి సమ్మయ్య, గొల్ల కురుమ సంఘం నాయకులు నిమ్మల శ్రీనివాస్, రజక సంఘం నాయకులు ఏదునూరి లక్ష్మయ్య, ఏదునూరి యాకయ్య, చిలుక వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.