నవ తెలంగాణ- నవీపేట్: మండలంలోని ఎల్కే ఫారం వ్యవసాయ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన వీర హనుమాన్ ఆలయంలో నిర్మాణ కర్త మువ్వ నాగేశ్వరరావు దంపతులు ఆదివారం హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు జలాభిషేకం, పుష్పాభిషేకం మరియు దాన్యాభిషేకం చేశారు. అనంతరం గోపూజ చేశారు. సోమవారం ఉదయం హోమంతో పాటు శాస్త్రోత్రంగా వీరహనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన అనంతరం తీర్థ ప్రసాదాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో హాజరై హనుమంతుని ఆశీస్సులు పొందాలని కోరారు.