
మండల కేంద్రంలో మర్కజ్ కమిటీ ఎన్నికలు ఆదివారం నాడు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో మర్కజ్ కమిటీ అధ్యక్షుడిగా షాహిద్ ప్రత్యర్థి ఇఫ్తాఖారోద్దీన్ పై 10 ఓట్ల తో విజయం సాధించాడు. ఉపాధ్యక్షుడిగా సలావుద్దీన్, సెక్రటరీగా సోహెల్, జాయింట్ సెక్రటరీగా శంషుద్దీన్, క్యాషియర్ గా షోయబ్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీలు వీరికి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మొత్తం ఓట్లు 802 ఓట్లు పోలైనాయని, ఎన్నికైన ఈ నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందనీ నిర్వాహకులు తెలిపారు.