వ్యక్తిత్వ వికాస ప్రేరణలో హస కొత్తూర్ వాసులకు ఉత్తమ అవార్డు

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండలంలోని హసకొత్తూర్ గ్రామానికి చెందిన ఉట్నూర్ నరేష్, మాలావత్ పావని వ్యక్తిత్వ వికాస  ప్రేరణలో ఉత్తమ అవార్డులను అందుకున్నారు.  సోమవారం హైదరాబాద్ లోని హరిహర కళా వేదికగాలో అత్యంత వైభవంగా జరిగిన మెగా ఇంపాక్ట్ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా ఉట్నూర్ నరేష్, మాలావత్ పావని ఉత్తమ వ్యక్తిత్వ వికాస  ప్రేరణలో ఉత్తమ అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమా నిర్వాహకులు  మారుమూల గ్రామం హసా కొత్తూర్ నుంచి వచ్చి ఇలా సమాజాన్ని జాగృత పరుస్తున్న నరేష్, పావని కి ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. రానున్న రోజుల్లో యువతరానికి మార్గ నిర్దేశకులుగా నిలవాలని సూచించారు. అనంతరం అవార్డు గ్రహీత నరేష్ మాట్లాడుతూ తను  ఎంతగానో ఇష్టపడే ప్రజాస్వామ్య సంస్కరణల కోసం పాటు పడే ఫౌండర్ జయ ప్రకాష్ నారాయణ చేతులమీదుగా అవార్డులను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డు వివరించడం ద్వారా తనపై  మరింత భాధ్యత పెరిగిందని తెలిపారు. మమ్మలి ఇంతగా సానపెట్టి మాలో ఉన్న ప్రతిభ, సామర్థ్యాన్ని వెలికి తీసిన గురువులు అంతర్జాతీయ ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు, హైదరాబాద్ నలిని టీచర్, నిజామాబాద్ లాబిశెట్టి మహేష్, నక్క నవీన్, వొజ్జ మహేందర్, మల్లెపూల విటలేశ్వర్ లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో,  ప్రభుత్వ కాలేజీ, యూనివర్సిటీ లల్లో చదివే యువతరానికి ఉచితంగా ప్రేరణ సదస్సులు  నిర్వహిస్తామని పావని, నరేష్  తెలిపారు.నవ భారత నిర్మాణంలో రాళ్లేత్తే కూలీలుగా పని చేస్తామని సభా ముఖంగా పావని, నరేష్ తెలిపారు.భార్య భర్తలైన  నరేష్ పావని దంపతులు ఇద్దరు అవార్డు కోసం పోటీ పడటం కొసమెరుపు. ఈ  కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఐపీఎస్ అధికారిణి  సరిత, రచయిత సనాతన ధర్మం సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి, అవధాని ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు, యోగా శిక్షకులు జగన్ గురూజీ, మోటివేషనల్ స్పీకర్ పట్టాభి రాము, ఆకెళ్ళ రాఘవేంద్ర రావు, శ్రీపాద రాము, నైనా జైస్వాల్, వేణు కళ్యాణ్ , ఎఫ్3 సినిమా ఫేమ్ ప్రదీప్,  కంప్యూటరు గురువు శ్రీధర్, మాజీ గవర్నర్లు, మాజీ ఐఏఎస్ అధికారులు, యింపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు, తదితరులు  పాల్గొన్నారు.