రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు, ఆర్మీ జవాన్లకు సన్మానం

నవతెలంగాణ-  ఆర్మూర్  

ఆలూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఉత్తమ  ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్న ఆలూరు నివాసి వేల్పూర్ శ్రీనివాస్, ఆర్మీ జవాన్ గా సేవలందిస్తూ స్వగ్రామానికి వచ్చిన మెట్పల్లి హర్షిత్ అనే యువకుడ్ని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ ఆలూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చే గురువు ఒకరు,  దేశ సరిహద్దులో దేశ రక్షణ కోసం ఇంకొకరు ఇద్దరు కూడా గ్రామానికి రాష్ట్రస్థాయిలో మంచి పేరు తీసుకురావడం జరిగింది అని వారిని యావత్ గ్రామ ప్రజల తరపున అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ  వీరి స్ఫూర్తితో గ్రామంలోని యువత పట్టుదలతో, క్రమ శిక్షణతో  చదివి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి నడుం బిగించాలని పిలుపు ఇవ్వడం జరిగింది.  రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత  వేల్పూరు శ్రీనివాస్ మాట్లాడుతూ అవార్డ్ వచ్చాక ఎన్నో వేదికల మీద సన్మానం అందుకోవడం జరిగింది కానీ పుట్టిన ఊర్లో ఆత్మీయుల మధ్య చేస్తున్న ఈ సన్మానం నాకు ఎంతో విలువైనది అని  నేటి యువత సన్మార్గంలో నడవడానికి నా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి ఉపసర్పంచ్ శ్రీనివాస్ వీడిసి అధ్యక్షులు బార్ల గణపతి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు రేగుళ్ల రజనీకాంత్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు స్పాట్  యూత్ అసోసియేషన్ సభ్యులు మా ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు విగ్నేశ్వర ఆటో యూనియన్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.