కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడం తీరనిలోటు

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
– మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి
నవతెలంగాణ – రాయపర్తి
బాధిత కుటుంబాలు ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడం తీరనిలోటు అని పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పుల్ల ఎల్లగౌడ్ తల్లి  పుల్ల అనసూర్య, బురహన్ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్దంగుల యాకయ్య, మైలారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గబ్బేట వెంకటయ్య అనారోగ్యంతో, రాయపర్తి మండల కేంద్రంలో నాగుల సాంబయ్య అనారోగ్యంతో మరణించగా వారివారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, సర్పంచులు కర్ర సరిత రవీందర్ రెడ్డి, సూదులు దేవేందర్, తెటతాకుల సుమతి యాదవ రెడ్డి, గారె నర్సయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.