– ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
– ఆస్పత్రి భవనం నిర్మాణానికి రూ.17.50 కోట్లు మంజూరు
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రిచే వారం రోజుల్లో పనులు ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన వైద్య విధానంతో వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సోమవారం ఆమనగల్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నా యకులతో పాటు వైద్య ఆధికారులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. 30 పడకల స్థాయి నుంచి ఆమనగల్ ప్రభుత్వ ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నా రు. ఆస్పత్రి నూతన భవనం నిర్మాణానికి రూ. 17.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపినా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున మొత్తం 32 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కల్వకుర్తి పట్ట ణంలో ఆస్పత్రి భవనం నిర్మాణానికి రూ.17.50 కోట్లు మంజూరు అయ్యాయని వివరించారు. 2 ఎకరాలు ఉన్న ఆమ నగల్ ప్రభుత్వ ఆస్పత్రి స్థలం 50 పడకల ఆస్పత్రికి సరిపోని పక్షంలో సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలా న్ని గుర్తించి వారం రోజుల్లో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఆమనగల్కు పూర్వ వైభవం వచ్చేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం, రూ.15 కోట్ల ప్రత్యేక నిధులతో ము న్సిపాలిటీ అభివృద్ధి, వారంరోజుల్లో ప్రభుత్వ జూని యర్ కళాశాల భవనం సమస్య పరిష్కారం అవు తుందని, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ జరుగుతు న్నా యని, పాల్టెక్నిక్ కళాశాల మంజూరైనట్లు గుర్తుచే శారు. ఆమనగల్ వరకు మెట్రో రైలు, త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణంతో రాబోయే 2,3 ఏండ్లలో ఆమన గల్ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఆస్పత్రి భవనాన్ని, ఆవర ణలో ఉన్న ఖాలీ స్థలాన్ని పరిశీలించారు. సమావేశం లో జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్య నాయక్, వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు పత్య నాయ క్, కంబాలపల్లి పరమేష్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు వస్పుల సాయిలు, న్యాయవాది దుడ్డు ఆంజ నేయులు, నాయకులు చుక్క నిరంజన్ గౌడ్, వడ్డే వెంకటేష్, రూపం వెంకట్ రెడ్డి, చలిచీమల సతీష్, ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం పాల్గొన్నారు.