– 50 సంవత్సరాలు సేవలు పొందిన ప్రజలు బోరున వినిపించారు
నవ తెలంగాణ-వెల్దుర్తి
చికిత్స పొందుతూ వైద్యుడు సిహెచ్ నర్సింలు సోమవారం తెల్లవారుజామున హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1952 సంవత్సరంలో మండల పరిధి కుకునూరు గ్రామంలో జన్మించారు. తండ్రి శివయ్య చెట్ల మందులతో వైద్యం నిర్వహించే వారన్నారు. డాక్టర్ నరసింహులు ఏడో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న క్రమంలో పేదరికం అడ్డు రావడంతో చదువుకు స్వస్తి చెప్పి గత కొన్ని ఏళ్లుగా వెల్దుర్తిలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు చేతి కింద చిన్నా చితక పనులు నిర్వహిస్తూ మందు గోళీలు ఇస్తూ మరికొంత కాలం అనంతరం ఆర్‌ఎంపీగా ప్రజలకు సేవ చేయడం జరిగింది. మరికొంతకాల అనంతరం జిల్లాలోనే గుర్తింపు పొంది మండల కేంద్రంలో వెంకటేశ్వర నర్సింగ్ హౌమ్ ఏర్పాటుచేసి మండల ప్రజలకే కాక అంతర్ జిల్లా ప్రజలకు సేవ చేసిన ఘనత ఈయనకే దక్కింది. ఇటు వైద్య వత్తి, అటు సామాజిక సేవలో తలమునకలై ఉండేవారు. ఎంబీబీఎస్ డాక్టర్ చేయలేని వైద్యం ఈయన చేసి శభాష్ అనిపించుకున్నారు. అటు సామాజిక సేవలో సబ్బండ వర్గాల ప్రజలకు వారి వారి కులదేవతలను స్వయంగా డబ్బులు ఖర్చు చేసి దేవతామూర్తులను ఇప్పించిన ఘనత ఈయనకే దక్కింది. అటు వైద్య రంగంలో ఇటు ధార్మిక కార్యక్రమాలు ఎన్నో సేవలు అందించి ప్రజల మన్ననలు పొంది అకాల మరణం పొందడంతో మండలం, జిల్లా నుంచి తరలివచ్చిన జనం బోరున వినిపించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యాన్ని నింపారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.