– ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి
నవ తెలంగాణ- గజ్వేల్
ఇంజనీర్లు ఇంటి నిర్మాణ యజమానులకు నాణ్యతమైన ప్లానర్స్‌ను భూములకు అనుగుణంగా ఇవ్వాలని మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళిలు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో బాలాజీ ప్లానర్స్, డ్రీమ్ హౌమ్ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో ప్లానర్స్ ఇచ్చే ఇంజనీర్లు ముందుగా భూమిని పరిశీలించి దానికి అనుగుణంగా ఉండే విధంగా నిర్మాణాలు చేయాలని సూచించాలన్నారు. భవిష్యత్తులో భూకంపాలు, ఇతర సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు భవనాలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిర్మాణాలు చేపట్టాలని వారు సూచించారు. స్థానిక యువకుడు ఇంజనీర్ గడీల సంజరు కుమార్ స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న ప్లానర్స్ ఆఫీస్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నామన్నారు. గడీల జయరాములు ముదిరాజ్ స్థానికంగా అందరికీ సమేతంగా ఉండాలని, ఆయన కుమారుడు గడీల సంజరు కుమార్ ప్లానర్ ఇంజనీర్‌గా రాణించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జఖీర్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గోపాల్ రెడ్డి, లక్ష్మి కిషన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బెండ మధు, మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు నవాజ్ తదితరులు పాల్గొన్నారు.