తుంగతుర్తి: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం కషి చేస్తోందని డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.సోమవారం మండలపరిధిలోని అన్నారం గ్రామంలో రూ.17 లక్షల వ్యయంతో నిర్మించనున్న పల్లె దవాఖానాకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామీణ వైద్యం కుంటుపడిపోయిందన్నారు.ప్రతి చిన్న ఆరోగ్య సమస్యలకు పట్టణాలకు వెళ్లే దుస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రామీణ వైద్యంపై దష్టి సారించారన్నారు.మారుమూల పల్లెల్లో సైతం ఆరోగ్య కేంద్రాలను, ఉప కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కంటికి రెప్పలా కాపాడుతున్నారన్నారు.అనంతరం గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల రైతు బంధు కోఆర్డినేటర్ దొంగరి శ్రీనివాస్, పోగుల శ్రీకాంత్ రెడ్డి, కడారి దాసు, ప్రవీణ్, సాగర్, పరశురాములు, నవీన్, సీపీఎం నాయకులు పల్లా సుదర్శన్, వివిధ వార్డుల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.