ఐక్య వేదిక పోతారం గ్రామ కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-ముత్తారం: ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ బహుజన ఐక్య వేదిక పోతారం గ్రామ కమిటీని మండల అధ్యక్షులు ఊట్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బండి ఓదెలు, ఉపాధ్యక్షులు బండ సదానందం, ప్రధాన కార్యదర్శి ఇట్టం గట్టయ్య, సంయుక్త కార్యదర్శిగా శనిగరం శ్రీకాంత్‌, కోశాధికారిగా గడ్డం శ్రీనివాస్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు.