నవతెలంగాణ-సిద్దిపేట : ఓటు ఒక వజ్రాయుధం లాంటిది. దానిని సక్రమంగా వినియోగిస్తే మన భవిష్యత్తును మార్చేయవచ్చు. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల్లో తానూ ఓటు వేసినట్లు జోహారా బీ (104) చెప్పారు. సిద్ధిపేట పట్టణం బొర్ర హనుమాన్ దేవాలయ సమీపంలో నివసిస్తున్న వందేళ్లు పైబడిన ఈ బామ్మ పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం హైస్కూలులోని 127 పోలింగ్ స్టేషనులో ఓటు హక్కు వినియోగించుకుంది. ప్రతీ ఎన్నికల సందర్భాల్లోనూ తాను ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు ఆమె కుమారుడు ఫయాజ్ తెలిపారు.