రాజా కష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందు తున్న చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. రెండు గంటల సింగిల్ షాట్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా యాక్ట్ చేస్తూనే సూపర్‌రాజా దీనికి రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. లేటెస్ట్‌గా సోమవారం ప్రసాద్‌లాబ్స్‌లో 8 నిమిషాల టైటిల్ లాంచ్ వీడియోని రిలీజ్ చేశారు. ‘ఈ టైటిల్ లాంచ్ వీడియోలో గ్రాఫిక్స్, విజువల్స్, కాన్సెప్ట్, పెర్ఫార్మన్స్, మ్యూజిక్, దర్శకత్వం, నటన వీక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. సినిమా కూడా ఇంతకు మించి ఉంటుంది. ఇందులోని ప్రతి ఒక్క అంశం ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని గర్వంగా చెప్పగలను. ఈ రెండు గంటల సింగిల్ షాట్ సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంది. డైలాగ్‌లు చెప్తూ, సాంగ్‌ని గుర్తు పెట్టుకుని ఒక్క ఎక్స్‌ప్రెషన్ మిస్ అవ్వకుండా స్టోరీ కొనసాగిం చడం ఎంత కష్టమో ఊహించడానికే వీలు కాదు. ఆ కష్టం, కసి, ఓర్పు మీరు సినిమాలోనూ చూడచ్చు’ అని సూపర్ రాజా చెప్పారు.
నటి రమ్య ప్రియ మాట్లాడుతూ, ‘ఇది నా మొదటి సినిమా. ఇలాంటి మంచి సినిమాలో యాక్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. ముఖ్య పాత్రధారి వంశి గొనె మాట్లాడుతూ,’ఈ సినిమా ఒక పెద్ద ఛాలెంజ్. నేను, సూపర్‌రాజా పడిన కష్టం, మా నటన మిమ్మల్ని అలరిస్తుందని’ అని చెప్పారు.