– తాండూర్ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటాం
– రైతుల కష్టాలు తీరుస్తాం
– బీజేపీలో యువతకు మొదటి ప్రాధాన్యత
– బీజేపీకి వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
– బీజేపీ విజయోత్సవంలో రాష్ట్ర కార్యవర్గ రమేష్ కుమార్
నవతెలంగాణ-పెద్దేముల్
జిల్లాలో బీజేపీ అఖండ విజయం సాధించడం 40 ఏండ్ల కల నెరవేరిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. లోకసభ ఎన్నికల్లో విజయం సాధించడాన్ని సాగస్తూ బుధవారం పెద్దేముల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మాట్లాడుతూ..దేశ ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో రైతులకు కష్టాలు తీరుస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్ రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత, కులాలు, మతాలు, ప్రాంతాలు వేరువేరు చేసిందనీ, దేశ ప్రధానీ నరేంద్ర మోడీ ఒకే వ్యవస్థగా ఏర్పాటు చేసిన వ్యక్తిగా గుర్తింపు వచ్చిందన్నారు. బీజేపీలో యువతకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని హామీనిచ్చారు. నరేంద్ర మోడీ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తాండూర్ ప్రాంత ప్రజల రుణం తీసుకునే ప్రయత్నంలో ఉంటామని చెప్పారు. ప్రజల సమక్షంలోనే ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల్లో కచ్ఛితంగా అభివృద్ధి పనులు చేసి చూపిస్తామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామగ్రామాన బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మాజీ మండలాధ్యక్షులు సందీప్ కుమార్, మండల అధ్యక్షులు హరీష్గౌడ్, ప్రధాన కార్యదర్శులు యాదయ్య గౌడ్, రామచందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.