
– ఘనంగా యూనియన్ బ్యాంక్ 105వ వార్షికోత్సవం
– సీనియర్ మేనేజర్ ప్రసాద్ కు వినతి పత్రం అందించిన పొగాకు రైతు సంఘం నాయకులు
నవతెలంగాణ- అశ్వారావుపేట: ఖాతాదారులు వల్లే యూనియన్ బ్యాంకు అభివృద్ధి చెందుతుందని బ్యాంకు లాభాల్లో నడవడానికి వారి నిబద్దతతో కూడిన లావాదేవీ లే కారణమని సీనియర్ మేనేజర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం యూనియన్ బ్యాంకు 105 వ వార్షికోత్సవాన్ని అశ్వారావుపేట శాఖ యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మొదటిగా ఖాతాదారులు తో సమావేశం నిర్వహించిన బ్యాంక్ అధికారులు సిబ్బంది అందిస్తున్న సేవలు ఖాతాదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ అశ్వారావుపేట బ్రాంచ్ రూ.200 కోట్లతో టర్నోవర్ జరుగుతుందని అందులో రూ.90 కోట్లు డిపాజిట్ కాగా రూ.110 కోట్లు రుణాల రూపంలో లావాదేవీలు నడుస్తున్నా యన్నారు.డిజిటల్ రంగంలో యూనియన్ బ్యాంకు మంచి ప్రగతి సాధిస్తుందని రాబోయే తరానికి ముందు చూపుతో సేవలను సరళతరం చేస్తున్నామన్నారు.ఇల్లు నిర్మించుకునేందుకు, వ్యాపార అభివృద్ధికి, వాహనాలకు, త్వరితగతిన రుణాలను మంజూరు చేసేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అర్హులైన వారు మా యూనియన్ బ్యాంకులో సంప్రదించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. పొగాకు రైతులకు రుణ పరిమితి పెంచాలి – పొగాకు రైతు సంఘం నాయకులు
ఈ ప్రాంతంలో ఎక్కువమంది పొగాకు సాగు చేస్తున్నారని వారికి గతంలో రూ.5 లక్షలు ఇచ్చేవారని ఇప్పుడు పక్క ప్రాంతంలో బ్రాంచ్ లలో రూ .7 లక్షలు చొప్పున రుణం ఇస్తున్నారని ఇక్కడ కూడా పొగాకు రైతులకు రుణ పరిమితి పెంచాలని రైతు సంఘం నాయకులు సీనియర్ మేనేజర్ ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కు వినతి పత్రం అందించారు.మీ వినతి ని పరిగణలోకి తీసుకుంటామని తప్పకుండా మీకు రుణ పరిమితి పెంచే విషయంలో సహకరిస్తామని బ్యాంకు అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వేముల సూర్యప్రకాశరావు,సుంకవల్లి వీరభద్రరావు, గడ్డమణుగు సత్యనారాయణ,కొల్లు వెంకటరమణ,ముక్కు శ్రీనివాస్,బ్యాంక్ సిబ్బంది మురళి,రాంబాబు,శ్రీధర్,హారిక, మనోహర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.